delhi: శృంగారానికి ముందు ఎవ్వరూ ఆధార్ కార్డును చెక్ చేసుకోలేరు: మైనర్‌పై అత్యాచారం కేసులో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య

Can not Check Aadhaar Card Before Sex says delhi High Court On Minor Rape Charge
  • ఏకాభిప్రాయ సంబంధంలో ఉన్న వ్యక్తి తన భాగస్వామి పుట్టిన తేదీని పరిశీలించాల్సిన అవసరం లేదన్న కోర్టు
  • మూడు వేర్వేరు పుట్టిన తేదీలతో ఉన్న మైనర్ పై అత్యాచారం కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు
  • పుట్టిన తేదీ చూశాకే భాగస్వామితో శారీరక సంబంధం పెట్టుకోవాలని లేదని వ్యాఖ్యానించిన ధర్మాసనం
ఏకాభిప్రాయ శారీరక సంబంధంలో ఉన్న వ్యక్తి తన భాగస్వామి పుట్టిన తేదీని న్యాయపరంగా పరిశీలించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అధికారిక పత్రాల ప్రకారం మూడు వేర్వేరు పుట్టిన తేదీలను కలిగి ఉన్న తన మైనర్ భాగస్వామిపై అత్యాచారం చేశాడని ఆరోపించిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ  హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ఒక వ్యక్తి ఆమెతో ఏకాభిప్రాయంతో శారీరక సంబంధం పెట్టుకునే ముందు ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ చూడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ కేసులో తనపై పిల్లల దుర్వినియోగ చట్టంలోని నిబంధనలను అమలు చేయడానికి మాత్రమే బాధితురాలు తన పుట్టిన తేదీలను ఉపయోగించుకుంటోందని నిందితుడి తరఫు న్యాయవాది వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. 

‘మరొక వ్యక్తితో ఏకాభిప్రాయంతో శారీరక సంబంధంలో ఉన్న వ్యక్తి, అవతలి వ్యక్తి యొక్క పుట్టిన తేదీని న్యాయపరంగా పరిశీలించాల్సిన అవసరం లేదు. అతను ఆధార్ కార్డునో పాన్ కార్డునో లేదంటే ఆమె పాఠశాల రికార్డులో పుట్టిన తేదీ చూశాకే శారీరక సంబంధంలోకి ప్రవేశించాలని లేదు. ఈ కేసులో బాధితురాలి పుట్టిన తేదీకి సంబంధించి, ప్రాసిక్యూటర్లు మూడు వేర్వేరు తేదీలను చూపించారు. ఆధార్ కార్డ్ ప్రకారం ఆమె పుట్టిన తేదీ 01.01.1998గా ఉంది. కాబట్టి దరఖాస్తుదారుడు మైనర్‌తో శారీరక సంబంధం పెట్టుకోలేదని చెప్పడానికి ఇది సరిపోతుంది’ అని జస్టిస్ జస్మిత్ సింగ్ అభిప్రాయపడ్డారు.
 
బాధితురాలిగా పేర్కొన్న వ్యక్తి ఖాతాలోకి భారీ  మొత్తంలో డబ్బు  బదిలీ చేయడాన్ని గమనించిన కోర్టు ఇది హనీ ట్రాప్ కేసు అని ప్రాథమిక నిర్థారణకు వచ్చింది. అలాగే, 2019, 2021లో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు ఆరోపించిన ఈ కేసులో ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, కేసు నమోదుకు ఇంత ఆలస్యం ఎందుకు అయిందనే దానిపై సంతృప్తికర కారణం చూపలేదని కోర్టు గుర్తించింది. 

బాధితురాలు ఇతర వ్యక్తులపై కూడా ఇలాంటి కేసులు పెట్టిందని, వాటితో పాటు ఆమె ఆధార్ కార్డు వివరాలపై విచారణ చేపట్టాలని పోలీస్ కమిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. రూ. 20 వేల వ్యక్తిగత పూచీకత్తుపై నిందితుడిని విడుదల చేయాలని, కేసు విచారణ కోసం పిలిచినప్పుడల్లా పోలీసు స్టేషన్‌లో రిపోర్టు చేసి కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
delhi
High Court
minor
rapr case
sex
bail

More Telugu News