Mahesh Babu: ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’షోలో మహేశ్ బాబు, సితార సందడి

Mahesh Babu daughter Sitara make grand entry on Dance India Dance Telugu reality show
  • ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ ప్రోమో విడుదల
  • తండ్రితో కలసి వచ్చిన సితార
  • డ్యాన్సర్లతో కలసి స్టేజీపై స్టెప్పులు వేసిన సితార
జీ తెలుగు చానల్ లో వచ్చే ఆదివారం ప్రసారమయ్యే 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్' రియాలిటీ షో కార్యక్రమంపై అంచనాలు పెరిగాయి. ఎందుకంటే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార వీడియో విడుదల అయింది. ప్రముఖ నటుడు మహేశ్ బాబు, తన కుమార్తె సితారతో కలసి కార్యక్రమంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం వీడియోలో చూడొచ్చు. ఈ కార్యక్రమం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. మహేశ్ బాబు ఓ రియాలిటీ షోలో భాగం కావడం ఇదే మొదటిసారి. 

ఈ ప్రోమో వీడియోలో సితార సైతం స్టెప్పులు వేయడాన్ని చూడొచ్చు. మహేశ్ బాబు బ్లాక్ టీషర్ట్ లో దర్శనమిస్తే, సితార ఆఫ్ స్కర్ట్ తో కనిపించింది. రెడ్ కార్పెట్ పై తండ్రి, కుమార్తె కలసి వస్తుంటే, కార్యక్రమానికి వీక్షకులుగా వచ్చినవారు, డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ చప్పట్లతో స్వాగతం పలకడం కనిపిస్తోంది. కేవలం అతిథులుగా వచ్చారా..? లేక మరేదైనా పాత్ర పోషించనున్నారా? అన్నది తెలుసుకునేందుకు ఆదివారం వరకు ఆగాల్సిందే. 


Mahesh Babu
Sitara
grand entry
Dance India Dance
reality show
zee telugu

More Telugu News