Shubman Gill: యువ క్రికెటర్ గిల్ తో సారా అలీఖాన్ డిన్నర్

Sara Ali Khan spotted with Shubman Gill cricket and Bollywood fans react
  • ముంబైలోని ఓ రెస్టారెంట్ లో దర్శనం
  • ఫోన్ లో బంధించిన అభిమాని
  • భిన్న కామెంట్లతో స్పందిస్తున్న అభిమానులు
టీమిండియా యువ క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ సభ్యుడు శుభ్ మన్ గిల్, బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ఒక్క చోట చేరితే..? అభిమానుల్లో సందేహాలు మొలకెత్తుతాయి. సరిగ్గా ఇదే జరిగింది. వీరిద్దరూ కలసి ఓ రెస్టారెంట్ లో డిన్నర్ చేశారు. ఓ అభిమాని దీన్ని తన ఫోన్ లో బంధించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ముంబైలోని బాస్టియన్ రెస్టారెంట్ కు వీరు కలసి వెళ్లడం, వెయిటర్ కు ఆర్డర్ చేయడం ఇవన్నీ వీడియోలో రికార్డు అయ్యాయి. 

పింక్ డ్రెస్ లో సారా అలీఖాన్ కనిపించగా, క్రికెట్ మైదానంలో ధరించే మాదిరి డ్రెస్ లో గిల్ దర్శనమిచ్చాడు. వీరిద్దరూ కలవడం వెనుక ఏ బంధం అయి ఉంటుంది? అన్నది అభిమానుల మనసులను తొలుస్తోంది. కామెంట్ల రూపంలో దీన్నే వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సారా అంటే గిల్ కు మక్కువ అంటూ ఓ యూజర్ ట్విట్టర్లో స్పందించాడు. 

సచిన్ టెండుల్కర్ కుమార్తె సారాతోనూ గిల్ డేటింగ్ చేసినట్టు గతంలో వార్తలు వచ్చాయి. దీంతో ‘‘క్రికెటర్ కుమార్తె (సారా టెండుల్కర్) నుంచి, క్రికెటర్ మనవరాలు (సారా అలీ ఖాన్) వరకు శుభ్ మన్ గిల్ చాలా దూరం వచ్చాడు’’ అంటూ ఓ యూజర్ చమత్కరించాడు. సారా అలీఖాన్ తాత మన్సూర్ అలీఖాన్ టీమిండియా మాజీ కెప్టెన్ కావడం గమనార్హం. 

Shubman Gill
Sara Ali Khan
spotted
restaurent
mumbai
dinner

More Telugu News