Brahmaji: అలయన్స్ ఎయిర్ సంస్థపై నటుడు బ్రహ్మాజీ ఆగ్రహం

Tollywood actor Brahmaji disappoints with Alliance Air
  • చండీగఢ్ నుంచి కులూ వెళ్లే విమానం కోసం బ్రహ్మాజీ వెయిటింగ్
  • మూడు గంటలకు పైగా నిరీక్షణ
  • ఇంకా ఎయిర్ పోర్టులోనే ఉన్నానని బ్రహ్మాజీ వెల్లడి
  • కనీసం ప్రకటన కూడా చేయలేదని అసంతృప్తి

దేశీయ విమానయాన సంస్థ అలయన్స్ ఎయిర్ (ఎయిరిండియా అనుబంధ సంస్థ)పై టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చండీగఢ్ నుంచి కులూ వెళ్లాలని భావించానని, అయితే మూడు గంటలకు పైగా వేచి చూస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా విమానం రాలేదని అసహనం వెలిబుచ్చారు. 

తాను ఇంకా ఎయిర్ పోర్టులోనే ఉన్నానని వెల్లడించారు. జరిగిన ఆలస్యానికి అలయన్స్ ఎయిర్ కనీసం క్షమాపణలు చెప్పకపోగా, కనీసం ఓ ప్రకటన కూడా చేయలేదని బ్రహ్మాజీ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు. తన ట్వీట్ కు అలయన్స్ ఎయిర్ ను, కేంద్ర విమానయాన శాఖ మంత్రిని ట్యాగ్ చేశారు. 

అనంతరం మరో ట్వీట్ లో స్పందిస్తూ, ఎట్టకేలకు 5 గంటల ఆలస్యం అనంతరం కులూ చేరుకున్నానని వెల్లడించారు.

  • Loading...

More Telugu News