Justice Indu Malhotra: ఆదాయం కోసం కమ్యూనిస్టు ప్రభుత్వాలు హిందూ దేవాలయాలను స్వాధీనం చేసుకుంటున్నాయి: సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఇందు మల్హోత్రా

Justice Indu Malhotra sensational comments on takeover of Hindu temples by Kerala government
  • శ్రీ పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణను కేరళ ప్రభుత్వం తీసుకోవాలనుకుందన్న జస్టిస్ ఇందు మల్హోత్రా
  • జస్టిస్ యూయూ లలిత్, తనతో కూడిన ధర్మాసనం దానికి అనుమతించలేదని వ్యాఖ్య
  • వైరల్ అవుతున్న జస్టిస్ ఇందు మల్హోత్రా వ్యాఖ్యల వీడియో
హిందూ దేవాలయాలకు సంబంధించి సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఇందు మల్హోత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదాయం కోసం హిందూ దేవాలయాలను కమ్యూనిస్టు ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటున్నాయని ఆమె అన్నారు. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ అంశంపై 2020లో ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం తీసుకున్న నిర్ణయం గురించి ఆమె మాట్లాడుతూ, ఆదాయం కోసమే హిందూ దేవాలయాలను స్వాధీనం చేసుకుంటున్నారని.. అందుకే శ్రీ పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణను ప్రభుత్వం తీసుకోవాలనుకోవడాన్ని తాను, జస్టిస్ యూయూ లలిత్ అనుమతించలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Justice Indu Malhotra
Kerala
Government
Temples

More Telugu News