Chandrababu: హరికృష్ణకు నివాళి అర్పించిన చంద్రబాబు, నారా లోకేశ్

Chandrababu and Nara Lokesh pays tributes to Nandamuri Hari Krishna
  • ఈరోజు నందమూరి హరికృష్ణ వర్ధంతి
  • మంచితం, ఆప్యాయతకు ప్రతిరూపమన్న చంద్రబాబు
  • ముక్కుసూటితనం మామయ్య నైజం అన్న నారా లోకేశ్
ఈరోజు నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. ఆయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ కూడా హరికృష్ణకు నివాళి అర్పించారు. 

మంచితనానికి, ఆప్యాయతకు రూపమిస్తే అది నందమూరి హరికృష్ణ అని చందబ్రాబు కొనియాడారు. తండ్రి ఎన్టీఆర్ ఆదర్శాలను జవదాటని కొడుకుగా, చైతన్య రథసారథిగా, నటుడిగా... తెలుగు ప్రజలకు ఎంతో చేరువైన హరికృష్ణగారు... తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పార్టీకి, ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు. హరికృష్ణగారి వర్ధంతి సందర్భంగా ఆ సౌజన్యమూర్తి స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని ట్వీట్ చేశారు. 

ముక్కుసూటితనం మామయ్య నైజమని నారా లోకేశ్ అన్నారు. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం ఆయనకే ప్రత్యేకమైన వ్యక్తిత్వమని కొనియాడారు. రాజకీయాల్లోనూ, నటనలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హరి మామయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు.
Chandrababu
Nara Lokesh
Nandamuri Hari Krishna
Telugudesam

More Telugu News