Nagarjuna: టబూతో ‘రిలేషన్ షిప్’ రూమర్లపై స్పందించిన నాగార్జున

When Nagarjuna opened up about relationship rumours with Tabu
  • టబూని అద్భుత, అందమైన ఫ్రెండ్ గా పేర్కొన్న నాగార్జున
  • ఆమె పేరు వింటే తన మొహం వెలిగిపోతుందన్న నటుడు
  • దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టమని వ్యాఖ్య
టాలీవుడ్ లో నాగార్జున-టబూ కాంబినేషన్ విజయవంతమైన వాటిల్లో ఒకటి. వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా 'నిన్నే పెళ్లాడతా', 'ఆవిడా మా ఆవిడే' సినిమాలు వచ్చాయి. 1996లో వచ్చిన 'నిన్నే పెళ్లాడతా' అయితే సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా పండింది. దాంతో వీరిద్ధరి మధ్య ఏదో ఉందంటూ రూమర్లు కూడా వచ్చాయి. చాలా కాలం పాటు వీరు రిలేషన్ షిప్ లో ఉన్నారనే వార్తలు కూడా వ్యాపించాయి. టబూ తనకు మంచి ఫ్రెండ్ అంటూ నాగార్జున లోగడ ఈ రూమర్లను ఖండించారు. తాజాగా ఓ మీడియా సంస్థతో ఇంటర్వ్యూ సందర్భంగా మరోసారి ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది.

‘‘టబూ నాకు అద్భుమైన స్నేహితురాలు. మా స్నేహం నాకు 21 - 22 ఏళ్లు, టబూకి 16 ఏళ్ల వయసు నుంచే కొనసాగుతోంది. అంటే జీవితంలో సగం కాలం. మా స్నేహం గురించి చెప్పింది చాలా తక్కువ. నేను దాచడానికి ఏమీ లేదు. మీరు ఆమె పేరును పలికారంటే నా మొహం వెలిగిపోతుంది. దాన్ని మీరు ఏదో అనుకుంటే అది మీరు చూసే దృక్పథం నుంచే ఉంటుంది. నా వరకు అయితే ఆమె అందమైన వ్యక్తి. అందమైన ఫ్రెండ్. అది ఎప్పటికీ అలానే ఉంటుంది’’ అని నాగార్జున చెప్పారు.

నాగార్జున భార్య అమలకు సైతం టబూ మంచి ఫ్రెండ్ గా ఉన్న విషయ గమనార్హం. గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అమల ఈ విషయాన్ని స్పష్టం చేశారు. టబూ హైదరాబాద్ వచ్చినప్పుడు తమ ఇంట్లోనే ఉంటుందని కూడా చెప్పారు.
Nagarjuna
opened
relationship
Tabu
rumours
good friend

More Telugu News