River Godavari: మళ్లీ దొరికిన పులస.. ఈసారి మరింత ఎక్కువ ధర!

another pulasa fish got high rate in yanam market
  • గోదావరిలో కొనసాగుతున్న పులస చేపల ప్రవాహం
  • గతవారం 2 కిలోల చేపకు రూ. 20 వేల ధర
  • నిన్న మరో చేపకు రూ. 23 వేల ధర పలికిన వైనం
గోదావరిలో పులస చేపల ప్రవాహం కొనసాగుతోంది. నదికి ఎదురీదుతూ వస్తున్న చేపలు జాలర్ల వలకు చిక్కుతూ వారి పంట పండిస్తున్నాయి. యానాం మార్కెట్లో గతవారం రెండు కిలోల బరువున్న పులసను రూ.19 వేలకు నాటి పార్వతి అనే మహిళ దక్కించుకుని, అనంతరం భైరవపాలేనికి చెందిన వ్యక్తికి దానిని రూ. 20 వేలకు అమ్మేశారు. తాజాగా అంతే బరువున్న చేపకు అంతకుమించిన ధర పలికింది. 

ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు కిలోల బరువున్న పులసను నిన్న సాయంత్రం స్థానిక రాజీవ్‌ బీచ్‌లోని వేలం కేంద్రం వద్ద వేలం వేశారు. పొన్నమండ రత్నం అనే మహిళ దానిని రూ. 22 వేలకు కొనుగోలు చేసింది. అనంతరం దానిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన వెంకటేశ్వర్లు రూ. 23 వేలకు కొనుగోలు చేశారు.
River Godavari
Yanam
Pulasa Fish

More Telugu News