Virat Kohli: కోహ్లీ... ఫాంలోకి వచ్చినట్టే వచ్చి..!

  • దుబాయ్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్
  • ఆసియా కప్ లో ఆసక్తికర పోరు
  • 19.5 ఓవర్లలో 147 ఆలౌట్
  • 12 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు చేసిన భారత్
  • 34 బంతుల్లో 35 పరుగులు చేసిన కోహ్లీ
Kohli makes an impression

టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. 148 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ కు ఉపక్రమించిన టీమిండియా 12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) డకౌట్ కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ 12 పరుగులకే వెనుదిరిగాడు. 

అయితే, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రాణించడం విశేషం అని చెప్పాలి. చాన్నాళ్లుగా సాధికారతతో ఆడలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోహ్లీ... ఈ పోరులో బంతిని బాగానే టైమింగ్ చేశాడు. ఆరంభంలో కొన్ని బంతులకు తడబడినప్పటికీ, క్రీజులో కుదురుకున్న తర్వాత తనదైన శైలిలో షాట్లు ఆడాడు. కోహ్లీ మొత్తమ్మీద 34 బంతుల్లో 35 పరుగులు చేశాడు. కోహ్లీ స్కోరులో 3 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. 

కోహ్లీ స్పిన్నర్ నవాజ్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దాంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

More Telugu News