Asia Cup: భార‌త్‌, పాక్ మ్మాచ్‌పై జోరుగా బెట్టింగులు.. భార‌త్ గెలుపు క‌న్నా పాక్ ఓట‌మి మీదే అమితాస‌క్తి

huge bettings on india and pakistan cricket match
  • భార‌త్ గెలిస్తే రూ.1,000కి రూ.6 వేలు
  • పాక్ టాస్ గెలిచి మ్యాచ్ గెలిస్తే 5 రెట్ల సొమ్ము
  • కేవ‌లం టాస్ ఏ జ‌ట్టు గెలుస్తుంద‌న్న దానిపైనా బెట్టింగ్‌
  • విరాట్ కోహ్లీ, బాబ‌ర్ అజామ్ స్కోరుపైనా పందేలు

ఆసియా క‌ప్‌లో భాగంగా ఆదివారం రాత్రి చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు, దాయాదీ దేశాలు భార‌త్‌, పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌పై అప్పుడే బెట్టింగులు మొద‌లైపోయాయి. నేటి రాత్రి దుబాయి ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్‌కు సంబంధించి టాస్ మొద‌లు కొన్ని బెట్టింగులు జ‌రుగుతున్నాయి. బెట్టింగ్ అడ్డాలుగా మారిన ప్ర‌దేశాలు ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్ల తాకిడితో కిట‌కిట‌లాడుతున్నాయి. సాంతం గుట్టుగా సాగుతున్న ఈ బెట్టింగుల‌కు సంబంధించిన వార్త‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.

ఇరు జ‌ట్ల మ‌ధ్య ఇప్ప‌టిదాకా జ‌రిగిన మ్యాచ్‌ల‌ను విశ్లేషిస్తే... ఫేవ‌రేట్‌గా భార‌తే నిలుస్తుండ‌గా... బెట్టింగ్‌ల్లోనూ భార‌త జ‌ట్టే హాట్ ఫేవ‌రేట్‌గా నిలుస్తోంది. పాక్ జ‌ట్టు కంటే భార‌త జ‌ట్టు మీదే బెట్టింగ్ రాయుళ్లు అధిక మొత్తాల్లో పందేలు కాస్తున్నారు. భార‌త్ టాస్ గెలిస్తే రూ.1,000కి రెండింతలు అని చెబుతున్న నిర్వాహ‌కులు... టాస్‌తో పాటు మ్యాచ్‌లో భార‌త్‌ విజ‌యం సాధిస్తే ఆరు రెట్ల సొమ్మును ఆఫ‌ర్ చేస్తున్నారు. అదే స‌మ‌యంలో పాక్ టాస్ గెలిచి భార‌త్ మ్యాచ్ గెలిస్తే మూడింతల మేర సొమ్ము ఇస్తామ‌ని చెబుతున్నారు.

ఇక టాస్‌తో పాటు మ్యాచ్‌ను పాక్ గెలిస్తే 5 రెట్ల సొమ్ము ఇస్తామ‌ని బెట్టింగ్ నిర్వాహ‌కులు చెబుతున్నారు. ఏ ర‌కంగా చూసినా... పాక్ జ‌ట్టు కంటే కూడా భార‌త జ‌ట్టుపైనే పందేలు కాయ‌డానికి బెట్టింగ్ రాయుళ్లు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అంతేకాకుండా భార‌త్ గెలుపు కంటే కూడా పాక్ ఓట‌మిపైనా పందేలు కాసేందుకు చాలా మంది ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఫ‌స్ట్ బ్యాటింగ్‌, ఇరు జ‌ట్ల‌ స్కోరు, విరాట్ కోహ్లీ చేసే ప‌రుగులు, బాబ‌ర్ ఆజం చేసే ప‌రుగులు... ఇలా ప్ర‌తి చిన్న అంశం మీదా పందేలు కాసేందుకు బెట్టింగ్ రాయుళ్లు ఆస‌క్తి చూపుతున్నారు.

  • Loading...

More Telugu News