TRS: మా డాడీని చూస్తే మోదీకి టెన్షన్.. అందుకే పిచ్చిపిచ్చి ఆరోపణలు: ‘బిగ్ డిబేట్’లో కల్వకుంట్ల కవిత

  • బీజేపీ టార్గెట్ తాను కాదన్న కవిత
  • కేసీఆర్‌తో ముప్పు తప్పదనే బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ
  • బీజేపీవి అన్నీ బ్యాక్ డోర్ పాలిటిక్స్ అని విమర్శ
  • లిక్కర్ కేసులో తనపై దర్యాప్తు చేసుకోవచ్చని సవాల్
BJP Target is KCR not me says TRS MLC Kavitha

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిన్న నిర్వహించిన ‘బిగ్ డిబేట్’లో పాల్గొన్న టీఆర్ఎస్ అగ్రనేత, ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కుంభకోణంలో బీజేపీ తన పేరు లాగడాన్ని ప్రస్తావిస్తూ.. బీజేపీ అసలు టార్గెట్ తాను కాదని, కేసీఆరే వాళ్ల టార్గెట్ అని అన్నారు. కేసీఆర్‌తో తమకు ముప్పు తప్పదని బీజేపీ గ్రహించిందని, అందుకనే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసి గొల్పుతోందని అన్నారు. 

తన తండ్రిని చూస్తే ప్రధాని మోదీకి టెన్షన్ అని, అందుకే ఇలాంటి పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బీజేపీవి అన్నీ బ్యాక్ డోర్ డోర్ పాలిటిక్స్ అని విమర్శించారు. యుద్ధంలో రాజును ఓడించాలంటే తొలుత చుట్టూ ఉన్న వారిని కొడతారని, బీజేపీ కూడా ఇప్పుడు అదే చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలకు ఈ విషయం అర్థమైతే చాలని అన్నారు. లిక్కర్ స్కామ్‌ విషయంలో తనపై వచ్చిన ఆరోపణల గురించి పట్టించుకోవద్దని కుటుంబ సభ్యులకు చెప్పానని, తన తండ్రికి కూడా అదే చెప్పానని కవిత పేర్కొన్నారు. ఈ విషయంలో అవసరమైనప్పుడు కేసీఆర్, కేటీఆర్ బహిరంగంగా స్పందిస్తారని కవిత అన్నారు. 

లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదని, దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చని సవాలు చేశారు. గిట్టని పార్టీలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం బీజేపీకి కొత్తకాదని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేస్తున్నది అదేనని ఆరోపించారు. కశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా, కన్యాకుమారిలో స్టాలిన్ కుటుంబంపైనా కేసులు పెట్టారని, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ ఎంపీలపై కేసులు పెట్టి జైల్లో ఉంచారని పేర్కొన్నారు. భారతదేశం ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీలో ఉందని వ్యాఖ్యానించారు. 

More Telugu News