CWC: నేడు సీడబ్ల్యూసీ భేటీ.. వర్చువల్‌గా పాల్గొననున్న సోనియా, రాహుల్, ప్రియాక గాంధీ

CWC to meet on Sunday to discuss party poll schedule
  • నేటి మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం
  • ప్రస్తుతం విదేశాల్లో ఉన్న సోనియా, రాహుల్, ప్రియాంక
  • జోడో యాత్రకు రాష్ట్రాల వారీగా ఇన్‌చార్జ్‌ల నియమాకం
  • ఏపీకి డాలీ శర్మ, తెలంగాణకు ఎస్‌వీ రమణ
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నేటి మధ్యాహ్నం మూడున్నర గంటలకు సమావేశం అవుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌కు ఆమోదం తెలిపేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం సోనియాగాంధీ విదేశాలకు వెళ్లడం, ఆమెకు తోడుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వెళ్లడంతో వారు ఈ సమావేశానికి వర్చువల్‌గా హాజరయ్యే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీలో ఐదు దశాబ్దాలపాటు కీలక నేతగా వ్యవహరించిన గులాంనబీ ఆజాద్ పార్టీని వీడడం, వెళ్తూవెళ్తూ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో.. ఈ సమావేశంలో సోనియా, రాహుల్ నాయకత్వంపై నేతలు విశ్వాసం ప్రకటించే అవకాశం ఉంది. కాగా, కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు కాంగ్రెస్ నిర్వహించనున్న జోడో యాత్రకు రాష్ట్రాలవారీగా సమన్వయకర్తలను పార్టీ నియమించింది. ఏపీకి డాలీశర్మ, తెలంగాణకు ఎస్‌వీ రమణి ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తారు.
CWC
Congress
Sonia Gandhi
Rahul Gandhi
Priyanka Gandhi

More Telugu News