Prime Minister: చ‌ర‌ఖాపై నూలు వ‌డికిన మోదీ... వీడియో ఇదిగో

pm narendra modi tour in ahmedabad in gujarat
  • అహ్మ‌దాబాద్‌లో ప‌ర్య‌టిస్తున్న న‌రేంద్ర మోదీ
  • ఖాదీ ఉత్స‌వ్‌లో భాగంగా నూలు వ‌డికిన ప్ర‌ధాని
  • అట‌ల్ బ్రిడ్జిని ప్రారంభించ‌నున్న వైనం
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ శ‌నివారం త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గుజ‌రాత్ వాణిజ్య రాజ‌ధాని, గ‌తంలో మోదీ ప్రాతినిధ్యం వ‌హించిన అహ్మ‌దాబాద్‌లో ఆయ‌న ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఖాదీ ఉత్స‌వ్‌ను పుర‌స్క‌రించుకుని మోదీ నూలు వ‌డికారు. ఇందుకోసం చ‌ర‌ఖా ముందు బాసింప‌ట్లు వేసుకుని కూర్చున్న మోదీ... తన చేతుల్లోకి నూలు దారాన్ని తీసుకుని చ‌ర‌ఖాపై దానిని వ‌డికారు. 

అహ్మ‌దాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా స‌బ‌ర్మ‌తి న‌దిపై పాద‌చారుల కోసం నూత‌నంగా నిర్మించిన అట‌ల్ బ్రిడ్జిని మోదీ ప్రారంభించ‌నున్నారు. గాలి ప‌టం ఆకారంలో నిర్మించిన ఈ బ్రిడ్జిని అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఈ బ్రిడ్జి అహ్మ‌దాబాద్ సిగ‌లో ఓ క‌లికితురాయిగా నిల‌వ‌నుంద‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే.
Prime Minister
Narendra Modi
Ahmedabad
Gujarat
Khadi Utsav
Sabarmati Riverfront

More Telugu News