JP Nadda: వరంగల్ లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న జేపీ నడ్డా, బండి సంజయ్... కాసేపట్లో హన్మకొండ సభ

JP Nadda and Kishan Reddy offers prayers at Warangal Bhadrakali Temple
  • బండి సంజయ్ పాదయాత్ర పూర్తి
  • హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బహిరంగ సభ
  • బాలసముద్రంలో ప్రొఫెసర్ వెంకట నారాయణ నివాసానికి వెళ్లిన నడ్డా
  • ప్రొఫెసర్ తో కలిసి సభ వద్దకు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు 
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న తెలంగాణ బీజేపీ నేడు హన్మకొండలో భారీ బహిరంగ సభతో తన సత్తా ప్రదర్శించేందుకు సమాయత్తమైంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర పూర్తయింది. ఈ సందర్భంగా హన్మకొండలో ఏర్పాటైన సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరవుతున్నారు. 

కాగా, ఈ సభ కోసం వరంగల్ చేరుకున్న జేపీ నడ్డా, బండి సంజయ్ ఇక్కడి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. కాళికా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన జేపీ నడ్డా తదితరులకు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. 

అనంతరం జేపీ నడ్డా బాలసముద్రంలో ప్రొఫెసర్ వెంకట నారాయణ నివాసానికి వెళ్లారు. అక్కడ మరికొందరు ప్రొఫెసర్లతో భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఫ్రొఫెసర్ వెంకట నారాయణతో కలిసి బీజేపీ సభ జరిగే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారు.
JP Nadda
Kishan Reddy
Bhadrakali Temple
Warangal
Hanmakonda
BJP
Telangana

More Telugu News