JP Nadda: వరంగల్ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నడ్డా, బండి సంజయ్

JP Nadda and Bandi Sanjay reaches Warangal Bhadrakali Temple
  • పాదయాత్రను ముగించిన బండి సంజయ్
  • భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నేతలు
  • కాసేపట్లో వరంగల్ లో బీజేపీ భారీ బహిరంగ సభ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరంగల్ కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన వరంగల్ కు చేరుకున్నారు. ఆయన వెంట పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హెలికాప్టర్ లో వచ్చారు. హెలికాప్టర్ దిగిన వెంటనే నడ్డా భద్రకాళి ఆలయానికి వెళ్లారు. అక్కడ ఉన్న గోశాలను ఆయన సందర్శించారు. ఇదే సమయానికి ఆలయం వద్దకు చేరుకున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రను ముగించారు. భద్రకాళి ఆలయ అర్చకులు నడ్డా, బండి సంజయ్, తరుణ్ చుగ్ లకు పూలమాలతో స్వాగతం పలికారు. వీరు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో వీరు బీజేపీ బహిరంగసభలో పాల్గొననున్నారు.
JP Nadda
Bandi Sanjay
Warangal
Bhadrakali Temple

More Telugu News