భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ యూయూ లలిత్.. వీడియో ఇదిగో!
- సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్
- సీజేఐగా ప్రమాణస్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- 74 రోజుల పాటు సీజేఐగా బాధ్యతలను నిర్వర్తించనున్న జస్టిస్ లలిత్
సీజేఐ యూయూ లలిత్ 1957 నవంబర్ 9న మహారాష్ట్రలోని షోలాపూర్ లో జన్మించారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. 2014 ఆగస్ట్ 13న ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. న్యాయవాది నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా నేరుగా నియమితులైన అతికొద్దిమందిలో ఆయనొకరు. మరోవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ అతి కొద్ది కాలం మాత్రమే బాధ్యతలను నిర్వహించనున్నారు. కేవలం 74 రోజుల్లోనే ఆయన పదవీ కాలం ముగియనుంది.