AIFF: భారత ఫుట్ బాల్ సమాఖ్యకు ఊరట.. నిషేధాన్ని ఎత్తేసిన ఫిఫా

FIFA Lifts Suspension on India
  • ఈ నెల 15న నిషేధం విధించిన ఫిఫా
  • కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ను ఏర్పాటు చేస్తామన్న ఏఐఎఫ్ఎఫ్
  • భారత్ లో యథావిధిగా జరగనున్న అండర్ 17 ప్రపంచ కప్
ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) పై విధించిన నిషేధాన్ని ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య ఫిఫా ఎత్తేసింది. ఏఐఎఫ్ఎఫ్ కార్యకలాపాల్లో థర్డ్ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయనే ఆరోపణలతో ఈ నెల 15న ఫిఫా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఫిఫా సూచన మేరకు... కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ను నియమిస్తామని ఏఐఎఫ్ఎఫ్ తెలియజేయడంతో నిషేధాన్ని ఫిఫా ఎత్తేసింది. ఇతరుల ప్రమేయం లేకుండా ఇకపై భారత ఫుట్ బాల్ వ్యవహారాలను కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ పర్యవేక్షించనున్నారు. మరోవైపు నిషేధం తొలగిపోవడంతో... ఇండియాలో ఈ ఏడాది అక్టోబర్ లో జరగనున్న అండర్ 17 ప్రపంచ కప్ యథావిధిగా జరగనుంది.
AIFF
FIFA
Ban
Lift

More Telugu News