తెలంగాణలో తాజాగా 290 కరోనా కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 21,198 కరోనా పరీక్షలు నిర్వహించగా, 290 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 115 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 24, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17 కేసులు గుర్తించారు. మరో 499 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 450 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 8,33,521 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,27,154 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,256 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

Telangana
Corona Virus
Statistics
New Cases

More Telugu News