Moderna: మా కరోనా వ్యాక్సిన్ ను కాపీ కొట్టారు... ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలపై దావా వేసిన మోడెర్నా

Moderna sues over rival pharma giants Pfizer and Bio NTech

  • ఎంఆర్ఎన్ఏ పద్ధతిలో మోడెర్నా వ్యాక్సిన్
  • తమకు పేటెంట్లు ఉన్నాయన్న మోడెర్నా
  • ఫైజర్, బయో ఎన్ టెక్ పేటెంట్ నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపణ

కరోనా సంక్షోభ సమయంలో దిగ్గజ ఫార్మా సంస్థలు పోటీపడి మరీ కరోనా వ్యాక్సిన్లను అభివృద్ధి చేశాయి. కాగా, ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలు తమ కరోనా వ్యాక్సిన్ సాంకేతికతను కాపీ కొట్టి అలాంటి వ్యాక్సిన్ నే తయారుచేశాయని అమెరికా ఫార్మా సంస్థ మోడెర్నా ఆరోపిస్తోంది.

ఈ మేరకు మోడెర్నా... ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలపై దావా వేసింది. 2010, 2016 మధ్య కాలంలో ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీకి సంబంధించి దాఖలు చేసిన పేటెంట్ లను ఈ రెండు సంస్థలు ఉల్లంఘించాయని మోడెర్నా ఓ ప్రకటనలో వెల్లడించింది. 

ప్రతి కణంలోనూ ప్రొటీన్ తయారీ వ్యవస్థలకు డీఎన్ఏ సంకేతాలను మోసుకెళ్లే జన్యు స్క్రిప్టునే ఎంఆర్ఎన్ఏ గా అభివర్ణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిలో ఈ టెక్నాలజీనే వినియోగిస్తున్నారు.

Moderna
Pfizer
BioNTech
Corona Vaccine
Sue
mRNA
  • Loading...

More Telugu News