Telangana: బంజారా మ‌హిళ‌ల‌తో కలిసి నృత్యం చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే... వీడియో ఇదిగో

korytla mla Kalvakuntla Vidyasagar Rao dances with banjara ladies on teej fest
  • దేశ‌వ్యాప్తంగా కోలాహ‌లంగా తీజ్ ఉత్స‌వాలు
  • పాటిమీది తండాలో జ‌రిగిన ఉత్స‌వాల‌కు క‌ల్వ‌కుంట్ల విద్యాసాగర్ రావు హాజ‌రు
  • మ‌హిళ‌ల‌తో క‌లిసి ఆడి పాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
దేశ‌వ్యాప్తంగా తీజ్ ఉత్స‌వాలు గ‌త కొన్నిరోజులుగా ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ‌లోని జ‌గిత్యాల జిల్లా కోరుట్ల నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పాటిమీది తండాలో గురువారం జ‌రిగిన తీజ్ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే క‌ల్వ‌కుంట్ల విద్యాసాగ‌ర్ రావు పాలుపంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న బంజారా మ‌హిళ‌ల‌తో క‌లిసి ఆడి పాడారు. మ‌హిళ‌ల‌తో క‌లిసి చిందులేశారు.

ఇటీవ‌లే నాగ‌ర్ క‌ర్నూలు జిల్లా ప‌రిధిలో జ‌రిగిన తీజ్ ఉత్స‌వాల్లో మ‌హిళా మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ ఉత్సాహంగా పాలుపంచుకున్న సంగ‌తి తెలిసిందే. గిరిజ‌న మ‌హిళ‌ల‌తో క‌లిసి ఆమె గిరిజ‌న వేష‌ధార‌ణ‌లో క‌నిపించారు. పార్టీ నేత‌ల‌తో క‌లిసి ఆమె ఉత్స‌వాల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.
Telangana
TRS
Teej
Banjara
Kalvakuntla Vidyasagar Rao
Korutla MLA

More Telugu News