PV Sindhu: ఏపీ సీఎం జ‌గ‌న్‌ను కలిసిన పీవీ సింధు, ర‌జ‌ని

pv sindhi and hockey player rajani met ap cm ys jagan
  • కామ‌న్వెల్త్‌తో స‌త్తా చాటిన సింధు, ర‌జ‌ని
  • ఇటీవ‌లే మంత్రి రోజా ఫ్యామిలీతో కలిసి లంచ్‌
  • ఏపీ క్రీడాకారుల స‌త్తాను ప్ర‌శంసించిన జ‌గ‌న్‌
ఇటీవ‌లి కామ‌న్వెల్త్ గేమ్స్ లో స‌త్తా చాటిన స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు, భార‌త హాకీ జ‌ట్టు స‌భ్యురాలు ర‌జ‌ని గురువారం ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కామ‌న్వెల్త్ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారుల స‌త్తాను జ‌గ‌న్ కీర్తించారు. కామ‌న్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింట‌న్‌లో పీవీ సింధు ప‌సిడి ప‌త‌కంతో మెరిసిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో మునుప‌టి కంటే మెరుగ్గా రాణించిన భార‌త హాకీ జ‌ట్టులో ర‌జ‌నీ కీల‌క భూమిక పోషించింది.

కామ‌న్వెల్త్ గేమ్స్ ముగిసిన త‌ర్వాత రాష్ట్రానికి చేరుకున్న సింధు, ర‌జ‌నిలు ఇటీవలే ఏపీ క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ఇంటికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. రోజా కుటుంబంతో క‌లిసి వారిద్ద‌రూ మ‌ధ్యాహ్న భోజ‌నం కూడా చేశారు. తాజాగా గురువారం తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చిన క్రీడాకారులు సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు.
PV Sindhu
YSRCP
YS Jagan
Roja
Andhra Pradesh
Rajani
Hockey Player
CWG

More Telugu News