Hand Pump: చేతి పంపు నుంచి నీటితో పాటు ఎగసిపడుతున్న మంటలు... వీడియో ఇదిగో!

Hand Pump Spews Fire and water In Madhya Pradesh Village
  • మధ్యప్రదేశ్ లోని చత్తార్ పూర్ జిల్లాలో ఆసక్తికర ఘటన
  • నీటితో పాటు మంటలను విరజిమ్ముతున్న పంపును చూసి ఆశ్చర్యపోతున్న జనాలు
  • వింతను చూసేందుకు తరలి వస్తున్న చుట్టుపక్కల గ్రామస్థులు
చేతి పంపు నుంచి పైకి తన్నుకొస్తున్న నీటితో పాటు మంటలు ఎగసిపడుతున్న ఆసక్తికర ఘటన మధ్యప్రదేశ్ లోని కచ్చార్ గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చత్తార్ పూర్ జిల్లా బక్స్ వాహా పంచాయత్ కు 10 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. నీటితో పాటు మంటలను విరజిమ్ముతున్న వీడియోను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. మరోవైపు దీన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించి అధికారులకు సమాచారం అందించారు. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా తరలి వస్తున్నారు.
Hand Pump
Fire
Water
Madhya Pradesh

More Telugu News