వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన అన్నా క్యాంటీన్‌లో భోజనం వడ్డించిన చంద్రబాబు.... ఫొటోలు ఇవిగో
- కుప్పంలో అన్యా క్యాంటీన్‌ను ఏర్పాటు చేసిన టీడీపీ
- ఉదయమే క్యాంటీన్‌ను ధ్వంసం చేసిన వైసీపీ శ్రేణులు
- గొడవ అనంతరం నిమిషాల్లో పునర్నిర్మితమైన క్యాంటీన్
- పేదలకు స్వయంగా వడ్డించిన చంద్రబాబు
పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన తర్వాత టీడీపీ శ్రేణులు అన్నా క్యాంటీన్‌ను పునర్మించాయి. అప్పటికే తయారు చేసి ఉంచిన వంటకాలను కూడా అక్కడికి తీసుకొచ్చారు. దీంతో కాస్తంత ఉత్సాహంగా కనిపించిన చంద్రబాబు... అన్నా క్యాంటీన్‌లోకి వెళ్లి స్వయంగా ప్రజలకు వడ్డించారు. వైసీపీ అడ్డుకున్నా కూడా అన్నా క్యాంటీన్ ద్వారా పేదల ఆకలిని తీరుస్తున్నామంటూ టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి.