Bandi Sanjay: వృద్ధురాలి పాదాల‌కు చెప్పులు తొడిగిన బండి సంజ‌య్‌... ఫొటోను పోస్ట్ చేసిన తెలంగాణ బీజేపీ

bjp posts a photo of bandi sanjay arranges slippers to a older lady
  • అమిత్ షాకు చెప్పులు అందించిన బండి సంజ‌య్‌
  • వైరి వ‌ర్గాల విమ‌ర్శ‌లను తిప్పికొట్టిన బీజేపీ తెలంగాణ చీఫ్‌
  • పాద‌యాత్ర‌లో ఇటీవ‌లే వృద్ధురాలికి చెప్పులు తొడిగిన సంజ‌య్‌
  • ఆ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ వైరి వ‌ర్గాల‌కు కౌంట‌ర్ ఇచ్చిన బీజేపీ
ఇటీవ‌ల తెలంగాణ ప‌ర్య‌ట‌నకు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు చెప్పులు అందించిన బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై వైరి వ‌ర్గాలు పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన బండి సంజ‌య్‌.. పెద్ద‌ల చెప్పులు మోయ‌డంలో త‌ప్పేముందంటూ ఎదురు దాడికి కూడా దిగారు. పెద్ద‌ల చెప్పులు మోయ‌డం మ‌న సంస్కృతిలో భాగ‌మేన‌ని కూడా ఆయ‌న త‌న‌ను తాను స‌మ‌ర్థించుకున్న వైనం కూడా తెలిసిందే.

ఇదిలావుంచితే, ప్ర‌స్తుతం ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరిట బండి సంజ‌య్ తెలంగాణ‌లో యాత్ర సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ యాత్ర‌లో భాగంగా ఆయ‌న ఇటీవ‌లే ఓ వృద్ధురాలి పాదాల‌కు చెప్పులు తొడిగారు. ఈ ఫొటోల‌ను బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేసిన బీజేపీ తెలంగాణ శాఖ వైరి వ‌ర్గాల‌కు కౌంటర్ ఇచ్చింది. 'పెద్ద‌ల‌ను గౌర‌వించండి. వారి దీవెన‌లు ఎల్ల‌ప్పుడూ మిమ్మ‌ల్ని వ్య‌తిరేక‌త నుంచి కాపాడ‌తాయి' అంటూ ఓ కామెంట్‌ను జ‌త చేసింది.
Bandi Sanjay
Telangana
BJP
Slippers
Amit Shah

More Telugu News