Milind Soman: ప్రధానిని కలిసిన ‘యూనిటీ రన్’ వీరుడు మిలింద్ సోమన్

Milind Soman meets PM Modi thanks him for promoting yoga and Ayurveda across India
  • పీఎంవో కార్యాలయంలో ప్రధానితో సమావేశం
  • ప్రాచీన క్రీడలు, ఆరోగ్యంపై చర్చ
  • ఆయుర్వేదం, యోగాను ప్రోత్సహిస్తున్నందుకు  ప్రధానికి సోమన్ కృతజ్ఞతలు  
ప్రముఖ నటుడు, నిర్మాత, ఫిట్ నెస్ ప్రేమికుడు మిలింద్ సోమన్ ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఇటీవలే భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఝాన్సీ నుంచి ఢిల్లీ వరకు ఐక్యతా పరుగును జెండా ఊపి ప్రారంభించడమే కాకుండా, అందులో పాల్గొన్న మిలింద్ సోమన్.. ప్రధానిని కలుసుకున్నారు. 

ఇందుకు సంబంధించి ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రధానిని కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. ప్రధానితో భేటీ సందర్భంగా క్రీడలు, ఆరోగ్యం, ఫిట్ నెస్ కు సంబంధించి ప్రాచీన సంప్రదాయాల గురించి చర్చ జరిగినట్టు మిలింద్ సోమన్ వెల్లడించారు. యోగా, ఆయుర్వేదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపినట్టు చెప్పారు. ఈ నెల 15న యూనిటీ రన్ మొదలు కాగా, 400 కిలోమీటర్లు పరుగెత్తి 22న సోమన్ ఢిల్లీ చేరుకున్నారు.
Milind Soman
meets
PM Modi
unity run

More Telugu News