Bandi Sanjay: తన ఇంటి వద్దే దీక్షకు దిగిన బండి సంజయ్

Bandi Sanjay deeksha at his home
  • కరీంనగర్ లోని ఇంటి వద్ద దీక్షకు దిగిన బండి సంజయ్
  • ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీక్ష
  • ఎన్ని ఆటంకాలు కలిగించినా పాద యాత్రను కొనసాగిస్తానని వ్యాఖ్య
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ లోని తన నివాసం వద్ద దీక్షకు కూర్చున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబంపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తనను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా తన ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తానని చెప్పారు. మరోవైపు హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా బీజేపీ ముఖ్యనేతలు దీక్షకు దిగారు. లక్ష్మణ్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జీవితా రాజశేఖర్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర పదాధికారులు దీక్షలో కూర్చున్నారు.
Bandi Sanjay
BJP

More Telugu News