శతాధిక వృద్ధుడు.. ఈటల రాజేందర్ తండ్రి కన్నుమూత

  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈటల తండ్రి మల్లయ్య
  • పరిస్థితి విషమించడంతో గత రాత్రి కన్నుమూత
  • నేటి మధ్యాహ్నం కమలాపూర్‌లో అంత్యక్రియలు
బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి, శతాధిక వృద్ధుడు ఈటల మల్లయ్య (104) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్యకు హైదరాబాద్‌లోని ఆర్వీఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి తుదిశ్వాస విడిచారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని స్వగృహానికి ఆయన మృతదేహాన్ని తరలించారు. నేటి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Etela Rajender
BJP
Etela Mallaiah

More Telugu News