సెప్టెంబరు 1 నుంచి టాలీవుడ్ లో మళ్లీ షూటింగులు
- వివిధ కారణాలతో నిలిచిన షూటింగులు
- గత 23 రోజులుగా చర్చించామన్న దిల్ రాజు
- కీలక నిర్ణయం తీసుకున్న ప్రొడ్యూసర్స్ గిల్డ్
- విదేశాల్లో ఈ నెల 25 నుంచి షూటింగులు
ఇకపై అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధరలు ఉంటాయని, పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని దిల్ రాజు చెప్పారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు వీపీఎఫ్ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు.
సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ, విదేశాల్లో చిత్రీకరణలు జరుపుకుంటున్న చిత్రాలు ఆగస్టు 25 నుంచి షూటింగులు జరుపుకోవచ్చని తెలిపారు. అత్యవసరమైతే ఫిలిం చాంబర్ అనుమతితో ఆగస్టు 25 నుంచి చిత్రీకరణలు జరుపుకునే అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించారు.