Nayi Brahmins: మంత్రి కొట్టు సత్యనారాయణను నిలదీసిన నాయి బ్రాహ్మణ సంఘం నేతలు

Nayi Brahmins demands minister Kottu Satyanarayana for old Govt Order implementation
  • గతంలో వెల్లంపల్లి ఇచ్చిన జీవో అమలు చేయాలని డిమాండ్
  • రూ.10 వేల ఫిక్స్ డ్ శాలరీ వద్దని స్పష్టీకరణ
  • దేవాదాయ శాఖ కమిషనరేట్ వద్ద ఉద్రిక్తత
ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇచ్చిన జీవోను అమలు చేయాలంటూ నాయి బ్రాహ్మణ సంఘం నేతలు ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను నిలదీశారు. మంత్రి కారుకు అడ్డుగా పడుకుని ముందుకు కదలనివ్వలేదు. దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులకు మినిమం స్కేల్ ఇస్తూ సిద్ధం చేసిన జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ.10 వేల ఫిక్స్ డ్ వేతనం తమకు వద్దంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో మంత్రికి ఇబ్బందికర వాతావరణం ఎదురైంది. నాయి బ్రాహ్మణ సంఘం నేతలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు.
Nayi Brahmins
Kottu Satyanarayana
G.O
Vellampalli Srinivasa Rao
Andhra Pradesh

More Telugu News