Chiranjeevi: సిటీకి దూరంగా కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాను: చిరంజీవి

Chiranjeevi thanked everyone who wished on his birthday
  • నిన్న చిరంజీవి బర్త్ డే
  • మెగాస్టార్ పై శుభాకాంక్షల వెల్లువ
  • అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన చిరు
  • అభిమానుల సేవాకార్యక్రమాలు మనసును తాకాయని వెల్లడి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు రక్తదానం చేయడం, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం తన మనసును తాకిందని పేర్కొన్నారు. అంతేకాదు, తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి దూరంగా వెళ్లి వేడుకలు జరుపుకున్నానని చిరంజీవి వెల్లడించారు. కుటుంబ సభ్యులతో గడిపిన ఆ క్షణాలు అద్భుతమని వివరించారు. ఈ మేరకు ఫొటోలను కూడా పంచుకున్నారు.
Chiranjeevi
Birthday
Family Members
Wishes
Fans
Tollywood

More Telugu News