Sensex: నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు

  • 257 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 87 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 3.78 శాతం పెరిగిన ఎం అండ్ ఎం షేర్ విలువ
markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాల నుంచి కోలుకున్నాయి. ఉదయం బలహీనంగానే ప్రారంభమైన మార్కెట్లు... మధ్యాహ్నానికి గాడిలో పడ్డాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిసినప్పటికీ... యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ఉండటం మన మార్కెట్లకు కలిసొచ్చింది. ఇంట్రాడేలో ఒకానొక సమయంలో సెన్సెక్స్ 900 పాయింట్ల మేర పెరగడం గమనార్హం. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 257 పాయింట్లు లాభపడి 59,031కి చేరుకుంది. నిఫ్టీ 87 పాయింట్లు పుంజుకుని 17,578కి పెరిగింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (3.78%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.75%), టైటాన్ (2.60%), టాటా స్టీల్ (2.38%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.12%). 

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-2.10%), ఇన్ఫోసిస్ (-2.09%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.25%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.14%), టెక్ మహీంద్రా (-1.12%).

  • Loading...

More Telugu News