కాసేపట్లో రాజాసింగ్ ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
- మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్
- ఈ ఉదయం ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు
- కాసేపట్లో బొల్లారం పీఎస్ నుంచి కోర్టుకు తరలించనున్న వైనం
మరోవైపు రాజాసింగ్ ఇంతకు ముందు మాట్లాడుతూ, తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయనే విషయం తనకు తెలుసని.. కానీ, ధర్మం కోసం తాను ఇలాగే మాట్లాడతానని చెప్పారు. చావుకు సైతం తాను సిద్ధమేనని అన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన తర్వాత వీడియో రెండో పార్ట్ విడుదల చేస్తానని చెప్పారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తాను ఎప్పుడూ మోదీ, అమిత్ షా ఫాలోయర్ గానే ఉంటానని అన్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఆయనపై చర్యలు తీసుకుంది. బీజేపీ శాసనసభాపక్ష నేత పదవి నుంచి, పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసింది.