Bandi Sanjay: బండి సంజయ్ ను కరీంనగర్ లోని నివాసానికి తరలించిన పోలీసులు.. ఫోన్ చేసిన అమిత్ షా

Police took Bandi Sanjay to his residence in Karimnagar
  • జనగామ జిల్లాలో సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • బండి సంజయ్, రాజాసింగ్ లపై బీజేపీ అధిష్ఠానం ఆరా
  • ధైర్యం కోల్పోవద్దని బండి సంజయ్ కు ఫోన్ చేసి చెప్పిన అమిత్ షా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ... జనగామ జిల్లాలో బండి సంజయ్ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి కరీంనగర్ లోని ఆయన నివాసానికి తరలించారు. 

మరోవైపు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ ల అరెస్ట్ పై బీజేపీ అధిష్ఠానం ఆరా తీస్తోంది. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితిపై వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు, బీజేపీ పెద్దలు సంజయ్ కు ఫోన్ చేశారు. ధైర్యం కోల్పోవద్దని అమిత్ షా ఆయనకు చెప్పారు. ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలపై పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. తన అరెస్ట్ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ... ఇలాంటి అరెస్ట్ లకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు.
Bandi Sanjay
Raja Singh
Arrest
Amit Shah
Phone

More Telugu News