launch: 5జీ సేవలు ముందుగా ప్రారంభమయ్యేది ఈ పట్టణాల్లోనే..!

5G to launch in these cities first check if you city is in the list
  • హైదరాబాద్ తోపాటు చెన్నై, ఢిల్లీ తదితర నగరాల్లో ఆరంభం
  • ఆయా పట్టణాల్లోనూ పూర్తి స్థాయి కవరేజీకి మరింత సమయం
  • రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ ఈ నెలలోనే ప్రారంభించే అవకాశం
5జీ టెలికం సేవలు అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. కాకపోతే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ 5జీ సేవలు ఆరంభంలో అందుబాటులో ఉండవు. ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లోనే ముందుగా ఈ సేవలు మొదలవుతాయి. తర్వాత కొంత కాలానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఇవి చేరువవుతాయి. ఎందుకంటే టెలికం కంపెనీలు 5జీ సేవలకు వీలుగా తగిన పరికరాలను దేశవ్యాప్తంగా అన్ని టవర్ల పరిధిలో ఏర్పాటు చేసుకోవడానికి సమయం తీసుకుంటుంది.

రిలయన్స్ జియో, ఎయిర్టెల్ 5జీ సేవలను ఈ నెలలోనే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 4జీ సేవలతో పోలిస్తే 5జీలో వేగం పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. ముందుగా 5జీ సేవలు హైదరాబాద్ తో పాటు, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్ నగర్, కోల్ కతా, లక్నో, ముంబై, పూణెలో మొదలు కానున్నాయి. 

ఇక ఈ పట్టణాల పరిధిలోనూ కవరేజీ పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలకూ ఉంటుందా? అంటే కాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ముందుగా ప్రారంభమయ్యే పట్టణాల్లోనూ 5జీ సేవలు ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలకే పరిమితం కావచ్చు. పూర్తి స్థాయి ఫలితాల విశ్లేషణ తర్వాత మిగిలిన ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకురావచ్చు.
launch
5G
telecom services
cities

More Telugu News