Tirumala: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు ఈ నెల 24న విడుదల

Tirumala Srivari  sevas tickets quota will be released on August 24
  • అక్టోబరు నెలకు చెందిన టికెట్లు ఎల్లుండి విడుదల
  • ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో టికెట్లు
  • అదే రోజున మరికొన్ని సేవల టికెట్లకు లక్కీ డిప్
  • సాయంత్రం 4 గంటలకు వర్చువల్ సేవల దర్శన కోటా విడుదల
కరోనా సంక్షోభం అనంతరం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో, తిరుమల వెంకన్న ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఆగస్టు 24న విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. అక్టోబరు మాసానికి చెందిన ఈ ఆర్జిత సేవల టికెట్లను ఎల్లుండి ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. 

అదే రోజున మధ్యాహ్నం 2 గంటలకు మరికొన్ని ఆర్జిత సేవల టికెట్లను లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నట్టు టీటీడీ పేర్కొంది. అంతేకాకుండా, అక్టోబరు నెలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శన కోటా టికెట్లను కూడా ఆగస్టు 24న సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్టు తెలిపింది.
Tirumala
Srivari Sevas
Quota
October
TTD

More Telugu News