చాలా రోజుల తర్వాత ఇండియాకు వచ్చిన రంభ.. వీడియో ఇదిగో!

Rambha in Tirumala
  • పెళ్లి చేసుకుని కెనడాలో సెటిలైపోయిన రంభ
  • తన అక్క కూతురు పెళ్లి కోసం ఇండియాకు తిరిగొచ్చిన వైనం
  • తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న రంభ
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు రంభ ఒక వెలుగు వెలిగింది. తెలుగుతో పాటు తమిళంలో సైతం ఆమె స్టార్ హీరోయిన్ గా చెలామణి అయింది. ఇప్పటికీ ఆమెకు ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉంది. హీరోయిన్ గా ఉండగానే ఆమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి కెనడాలో ఉంటోంది. ఇప్పుడు ఆమె ఒక పెళ్లి కోసం తిరిగొచ్చింది. ఈ క్రమంలో ఈరోజు ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంది. స్వామివారి దర్శనానంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ... దర్శనం చాలా బాగా అయిందని చెప్పారు. తన అక్క కూతురి వివాహం కోసం ఫ్యామిలీతో కలిసి ఇండియాకు వచ్చానని తెలిపారు. ప్రస్తుతం ఇంతకు మించి ఏం మాట్లాడలేనని చెపుతూ ఆమె ముందుకు సాగారు.
Go Back to Shorts
Rambha
Tollywood
Canada
India
Tirumala

More Telugu News