India: భారత గ్రాండ్​ మాస్టర్​ ప్రజ్ఞానంద సంచలనం.. ప్రపంచ చెస్ చాంపియన్​ పై గెలుపు

  • ఎఫ్ టీఎక్స్ క్రిప్టో కప్ టోర్నీ ఏడో రౌండ్ లో మాగ్నస్ కార్ల్ సన్ పై  విజయం
  • టోర్నీలో రన్నరప్ గా నిలిచిన ప్రజ్ఞానంద
  • కార్ల్ సన్ పై భారత గ్రాండ్ మాస్టర్ కు ఇది మూడో విజయం 
R Praggnanandhaa beats World Chess Champion Magnus Carlsen again

భారత గ్రాండ్‌మాస్టర్  ఆర్. ప్రజ్ఞానంద మరోసారి సంచలన ప్రదర్శన చేశాడు. నార్వే చెస్ దిగ్గజం, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను మరోసారి ఓడించి ఔరా అనిపించింది. ఆరు నెలల కాలంలో మాగ్నస్ పై భారత యువ ఆటగాడికి ఇది మూడో విజయం కావడం విశేషం. తాజాగా మయామిలో జరిగిన చాంపియన్స్ చెస్ టూర్ అమెరికన్ ఫైనల్ అయిన ఎఫ్టీఎక్స్  క్రిప్టో కప్‌ టోర్నమెంట్ లో  మాగ్నస్  పై కీలక విజయంతో ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు.

ఎనిమిది మంది గ్రాండ్ మాస్టర్లు పోటీ పడ్డ ఈ టోర్నీలో  సోమవారం జరిగిన చివరి, ఏడో రౌండ్లో మాగ్నస్ ను ప్రజ్ఞానంద ఓడించాడు. ఈ రౌండ్లో భాగంగా మొదట జరిగిన నాలుగు ర్యాపిడ్ గేమ్స్ లో తొలి రెండు డ్రా అయ్యాయి. కార్ల్‌సెన్ మూడో గేమ్‌ను కైవసం చేసుకోగా, నాలుగో గేమ్‌ను ప్రజ్ఞానంద గెలుపొందాడు. దాంతో, విజేతను టై- బ్రేక్‌ ద్వారా నిర్వహించారు. 17 ఏళ్ల భారత గ్రాండ్‌ మాస్టర్ రెండు టై బ్రేక్ గేమ్లను గెలుచుకోవడం ద్వారా ప్రపంచ చాంపియన్ కు షాకిచ్చాడు. దాంతో, మొత్తంగా 15 పాయింట్లు రాబట్టిన ప్రజ్ఞానంద రన్నరప్ గా నిలిచాడు. ఆఖరి రౌండ్లో భారత ప్లేయర్ చేతిలో ఓడినా.. 16 పాయింట్లతో మాగ్నస్ కార్ల్ సన్ ట్రోఫీ గెలుచుకున్నాడు.

More Telugu News