: అమెరికాలో భారత చిన్నారి తడాఖా

knaidel, ఈ పదాన్ని సరిగ్గా పలకండి... మీరు కూడా భారత చిచ్చరపిడుగు అరవింద్ మహాకాళి సరసన ఉన్నట్లే. ఈ కుర్రాడు ఫైనల్లో ఈ పదాన్ని సరిగ్గా పలికి 86వ స్ర్కిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ చాంపియన్ షిప్ కైవసం చేసుకున్నాడు. అమెరికాలో ఏటా స్పెల్లింగ్ పోటీలు పలు జరుగుతూ ఉంటాయి. వాటిల్లో ఎక్కువ శాతం అక్కడ స్థిరపడిన భారతీయుల చిన్నారులే ముందుంటున్నారు. వీటిల్లో ప్రధానంగా చిన్నారుల బ్రెయిన్ పవర్ ను పరీక్షిస్తారు. 13 ఏళ్ల అరవింద్ న్యూయార్క్ నగరంలో ఉంటాడు. అరవింద్ 2011, 2012 స్పెల్లింగ్ చాంపియషన్ షిప్ లలోనూ 3వ స్థానంలో నిలిచాడు. అప్పుడు జర్మనీ పదాలను పలకడంలో తప్పులు చేసి చాంపియన్ షిప్ కోల్పోయాడు. ఈ సారి మాత్రం తప్పటడుగు వేయకుండా విజయాన్ని దక్కించుకున్నాడు.

More Telugu News