Roja: వివాహ వార్షికోత్స‌వాన జ‌గ‌న్ ఆశీస్సులు తీసుకున్న మంత్రి రోజా... ఫొటోలు ఇవిగో

ap minister roja takes blessings fromjagan on her marriage day
  • సెల్వ‌మ‌ణితో రోజా వివాహం
  • ఆదివారం నాటికి 20 ఏళ్లు పూర్తి అయిన వైవాహిక బంధం
  • కాణిపాకం ఆల‌యంలో రోజా దంప‌తుల పూజ‌లు
  • తాడేప‌ల్లిలో జ‌గ‌న్ ఆశీర్వాదం తీసుకున్న మంత్రి దంప‌తులు
ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా ఆదివారం త‌న 20వ వివాహ వార్షికోత్స‌వ వేడుక‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. త‌న పెళ్లి రోజును పుర‌స్క‌రించుకుని భ‌ర్త సెల్వ‌మ‌ణితో క‌లిసి చిత్తూరు జిల్లా ప‌రిదిలోని కాణిపాకం వ‌ర సిద్ధి వినాయ‌కుడి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేసిన రోజా... ఆ త‌ర్వాత నేరుగా తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ నివాసం చేరుకున్నారు. భ‌ర్త‌తో క‌లిసి రోజా... జ‌గ‌న్ నుంచి ఆశీర్వాదం అందుకున్నారు. 

సెల్వ‌మ‌ణితో త‌న వివాహం జ‌రిగి నేటికి 20 ఏళ్లు అవుతోంద‌ని రోజా పేర్కొన్నారు. ఈ 20 ఏళ్ల జీవితాన్ని ఒక్క‌సారిగా ప‌రిశీలించుకుంటే... అన్నీ సంతోష‌క‌ర‌మైన దినాలు క‌నిపించాయ‌ని ఆమె తెలిపారు. ఇక‌పైనా సంతోష‌క‌ర జీవితాన్ని గ‌డిపే దిశ‌గా తాము సాగ‌నున్నామ‌ని కూడా ఆమె తెలిపారు.
Roja
YSRCP
YS Jagan
Marriage Day

More Telugu News