Janasena: పులివెందుల నుంచే చెక్కుల పంపిణీని ప్రారంభించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

pawan kalyan starst cheques distribution from pulivendula
  • ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసా యాత్ర‌
  • సిద్ధ‌వ‌టం ర‌చ్చ‌బండ‌లో చెక్కులు పంపిణీ చేస్తున్న ప‌వ‌న్‌
  • ఒక్కో కుటుంబానికి రూ.1 ల‌క్ష అంద‌జేత‌
వ్య‌వ‌సాయం క‌లిసి రాక‌ ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌కు అండ‌గా నిలిచే ఉద్దేశంతో జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసా పేరిట ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా శ‌నివారం ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌... జిల్లాలోని సిద్ధ‌వ‌టంలో ఏర్పాటు చేసిన ర‌చ్చ‌బండ‌లో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌కు చెక్కుల పంపిణీని ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా పులివెందులకు చెందిన కౌలు రైతుల కుటుంబాల‌కు చెక్కుల‌ను అందించ‌డంతోనే ప‌వ‌న్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఉమ్మ‌డి క‌డ‌ప‌ జిల్లాలో మొత్తం 170 మందికి పైగా కౌలు రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌గా... వారి కుటుంబాల‌కు రూ.1 ల‌క్ష చొప్పున ప‌వ‌న్ సాయం అందిస్తున్నారు.
Janasena
Pawan Kalyan
Kadapa District
Pulivendula
YS Jagan

More Telugu News