car shaped: అది కారు డోర్ అనుకునేరు.. కాదు, కాదు ఇంటి గేట్!

Interesting car shaped gate intrigues Anand Mahindra leaves him with questionsb
  • ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన కొత్త విశేషం
  • ఇంటి గేటును కారు మాదిరిగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తి
  • కారు డోర్ మాదిరే తీసుకుని వచ్చిపోయే ఏర్పాటు
రోటీన్ కు భిన్నంగా ఆలోచించినప్పుడు కొత్తదనం సంతరించుకుంటుంది. అది ఓ ఇంటి ముందున్న ప్రహరీ గేటు. కానీ, బాగా పరిశీలించి చూస్తేనే ఆ విషయం తెలుస్తుంది. లేదంటే దాన్ని కారుగానే పొరబడతారు. ఎందుకంటే కారు మాదిరే అటూ ఇటూ కదులుతుంది. కారు మాదిరే డోర్లు, విండోలు కనిపిస్తాయి. కారు అంటే మమకారం ఉన్న ఓ వ్యక్తి తన గేటుకు వినూత్నంగా చేసుకున్న ఏర్పాటు ఇది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా కళ్లలో ఈ కారు (గేట్) కూడా పడింది. ఇలాంటి అరుదైన విశేషాలను షేర్ చేయడంలో ముందుండే ఆనంద్ మహీంద్రా దీన్ని కూడా తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసి, తన అభిప్రాయాలను పంచుకున్నారు.

‘‘ఈ వ్యక్తి..
1. కారు అంటే ఎంతో మక్కువ కలిగిన వ్యక్తి?
2. ఎవరూ తన ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించకూడదనుకునే అంతర్ముఖుడు?
3. చమత్కారంతో కూడిన హాస్యం కలిగిన వ్యక్తి?
4. పై వన్నీ కూడా?’’
ఈ ఆప్షన్లలో ఏది అతడికి సరిపోతుందో కామెంట్ల రూపంలో చెప్పమని కోరినట్టుగా ఆనంద్ మహీంద్రా ఆప్షన్లతో పోస్ట్ పెట్టారు. నెటిజన్లు ఉత్సాహంగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. కొత్త ఐడియాను తెగ మెచ్చుకుంటున్నారు.
car shaped
gate
Anand Mahindra
Interesting car
vedio viral

More Telugu News