Zimbabwe: చాహర్ భుజంపై చేయి వేసేందుకు అనుమతి కోరిన జింబాబ్వే మహిళ

Can I touch you Zimbabwe bowlers familys unbelievable interaction with India cricketer Deepak Chahar
  • ఓకే చెప్పిన దీపక్ చాహర్
  • అతడితో ఫొటోలు తీసుకునేందుకు యువతుల ఆసక్తి
  • భారత క్రికెటర్లతో ముచ్చటించాలన్న ఉత్సాహం
జింబాబ్వే, భారత్ జట్ల మధ్య తొలి మ్యాచ్ అనంతరం ఆసక్తికరమైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. మన ఆటగాళ్లకు అక్కడి వారు ఫిదా అయ్యారు. భారత క్రికెటర్లతో ముచ్చటించేందుకు జింబాబ్వే క్రికెటర్ల కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు, స్టేడియం సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది అందరూ ఉత్సాహం చూపించారు. అయితే, ఇందులో దీపక్ చాహర్ తో ఫొటోలు దిగేందుకు మహిళలు ఆసక్తి చూపించారు.

దీపక్ చాహర్ మైదానం బౌండరీ లైన్ వరకు వచ్చి నిలబడగా, ఓ యువతి ‘నేను మిమ్మల్ని టచ్ చేయవచ్చా?’ అని చాహర్ ను అడిగింది. దానికి అతడు ఓకే అన్నాడు. దాంతో ఆమె చాహర్ భుజంపై చేయి వేసి ఫొటో తీయమంటూ అటువైపున్న తన ఫెండ్స్ కు సంకేతం ఇచ్చింది. ఈ సందర్భంగా నవ్వు ఆపుకోలేక ఆమె చేయి అడ్డం పెట్టుకుంది. అంతేకాదు, ఆమె స్నేహితురాళ్లు కూడా చాహర్ దగ్గరగా వచ్చి ఫొటోలు తీయించుకున్నారు.
Zimbabwe
Deepak Chahar
fans
photos

More Telugu News