Nityananda: నిత్యానందకు నాన్ బెయిలబుల్ వారెంట్

  • అత్యాచారం కేసు విచారణలో కోర్టుకు హాజరుకాని నిత్యానంద
  • దేశం విడిచి వెళ్లడంపై పెద్ద ఎత్తున ప్రచారం
  • కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడని వార్తలు
Non bailable arrest warrant to Nityananda

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామికి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి బెంగళూరులోని రామనగర జిల్లా సెషన్స్ కోర్టు ఈ వారెంట్ ఇష్యూ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని 2019లో కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే, ఆయన ఎక్కడున్నాడో పోలీసులు గుర్తించలేకపోయారు. ఆయన దేశం విడిచి పోయారనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో, బాధితులు కోర్టుకు తమ ఆందోళనను తెలియజేశారు. దీంతో, కోర్టు నిత్యానందకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 

మరోవైపు, నిత్యానంద 'కైలాస' అనే స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసినట్టు గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ కైలాస దేశం ఎక్కడుందనే విషయంలో గందరగోళం నెలకొంది. ఈక్వెడార్ సమీపంలో ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి కైలాస అనే పేరు పెట్టారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఈక్వెడార్ ఖండించింది. మరోవైపు నిత్యానంద చనిపోయాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే, తాను బతికే ఉన్నానని, వైద్య చికిత్స పొందుతున్నానని నిత్యానంద వెల్లడించాడు.

More Telugu News