Raj Nath Singh: సైన్యంలో చేరాలనే కోరిక ఉన్నప్పటికీ.. చేరలేకపోయాను: రాజ్ నాథ్ సింగ్

I wanted to join army says Raj Nath Singh
  • సైన్యంలో చేరాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నానన్న రాజ్ నాథ్ 
  •  ఆ సమయంలో నాన్న చనిపోవడంతో చేరలేకపోయానని వెల్లడి 
  • ఆర్మీ యూనిఫామ్ లో ఒక ఛరిష్మా ఉంటుందని వ్యాఖ్య 
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నానని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా సైన్యంలో చేరలేకపోయానని చెప్పారు. ఆర్మీలో చేరేందుకు సన్నద్ధమయ్యానని... షార్ట్ సర్వీస్ కమిషన్ కు ఒకసారి దరఖాస్తు కూడా చేసుకున్నానని... అయితే ఆ సమయంలో తన తండ్రి మరణించడంతో సైన్యంలో చేరలేకపోయానని తెలిపారు. 

తాజాగా ఈ విషయాన్ని చెపుతూ రాజ్ నాథ్ భావోద్వేగానికి గురయ్యారు. ఆర్మీ యూనిఫామ్ లో ఒక ఛరిష్మా ఉంటుందని చెప్పారు. సైనిక దుస్తులను చిన్న పిల్లాడికి ఇచ్చినా అతనిలో ఒక ఛరిష్మా కనిపిస్తుందని అన్నారు. రాజ్ నాథ్ సింగ్ ప్రస్తుతం మణిపూర్ లో పర్యటిస్తున్నారు. అక్కడి ఇన్స్ పెక్టర్ జనరల్ అస్సాం రైఫిల్స్ (సౌత్) ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అస్సాం రైఫిల్స్, రెడ్ షీల్డ్ డివిజన్ బృందాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ... ఆయన తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
Raj Nath Singh
Army
BJP

More Telugu News