india: రష్యా భద్రతా సలహాదారుతో అజిత్ దోవల్ భేటీ

National Security Adviser Ajit Doval Meet  Russian Counterpart In Moscow
  • మాస్కోలో సమావేశమైన ఇరు దేశాల భద్రతా మండలి
  • భద్రతా రంగంలో ద్వైపాక్షిక సహకారంపై చర్చ
  • ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి కూడా ప్రస్తావన 
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. ఆ దేశ భద్రతా సలహాదారు నికోలాయ్ పత్రుషేవ్‌తో మాస్కోలో సమావేశం అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై వీరు చర్చించినట్టు సమాచారం. భద్రతా రంగాలలో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన సమస్యలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ ఎజెండాలోని సమయోచిత అంశాలపై ఇరుపక్షాల మధ్య చర్చలు జరిగినట్టు రష్యాకు చెందిన ఓ పత్రిక పేర్కొంది. 

‘భద్రతా రంగానికి సంబంధించిన విస్త్రృత శ్రేణి అంశాల్లో ద్వైపాక్షిక సహకారంపైనా, ప్రాంతీయ, అంతర్జాతీయ ఎజెండాలోని సమయోచిత సమస్యలపైనా చర్చించారు. రష్యా-భారత్ ప్రత్యేక, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రగతిశీల అభివృద్ధిని నొక్కిచెప్పారు’ అని తెలిపింది. వివిధ అంశాల్లో ద్వైపాక్షిక వ్యూహాత్మక సహకారం అందించుకోవడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితికి సంబంధించిన వివిధ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలిపింది.
india
Russia
Ajit Doval
National Security Adviser

More Telugu News