Bay of Bengal: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నాలుగు రోజుల పాటు భారీ వర్ష సూచన

  • ఇప్పటికే కొనసాగుతున్న అల్పపీడనం
  • ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడబోతోందన్న వాతావరణ శాఖ
  • ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడి
IMD warns heavy rains

ఇప్పుటికే భారీ వర్షాలతో దేశంలోని పలు రాష్ట్రాలు చిగురుటాకులా వణికాయి. వరదల ప్రభావం నుంచి ప్రజలు ఇంకా కోలుకోక ముందే వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్తను తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందని చెప్పింది. 

ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశాపై ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావాన్ని చూపించబోతోందని చెప్పింది. తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం ఉండొచ్చని వెల్లడించింది. 

మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో పలు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

More Telugu News