Vladimir Putin: 75 వసంతాల స్వతంత్ర భారతావనికి శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు పుతిన్

Russia President Vladimir Putin wishes India on Independence Day
  • భారత్, రష్యా బంధం ప్రత్యేకమన్న పుతిన్
  • ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని వెల్లడి
  • భారత్ సమున్నత స్థాయిలో నిలిచిందని కితాబు
  • రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీలనుద్దేశించి ప్రకటన
భారతదేశం స్వతంత్రం పొంది 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. నేడు దేశం 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు తెలియజేశారు. 

భారత్-రష్యా మైత్రి ప్రత్యేకమైనదని ఆయన అభివర్ణించారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని అన్నారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలో సమున్నతస్థాయిలో నిలిచిందని కొనియాడారు. ఆర్థిక, సాంకేతిక, సామాజిక రంగాల్లో భారత్ విశేష రీతిలో అభివృద్ధి సాధించిందని తెలిపారు. అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో భారత్ కీలకపాత్ర పోషిస్తోందని కీర్తించారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలను ఉద్దేశించి ప్రకటన చేశారు.
Vladimir Putin
India
Wishes
Independence Day
Russia

More Telugu News