మనవడితో కలిసి స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్న ముఖేశ్ అంబానీ
- దేశ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
- తన నివాసంలో వేడుకలు జరుపుకున్న అంబానీ
- భార్య నీతా, మనవడు పృథ్వీలతో కలిసి జెండాకు వందనం చేసిన ముఖేశ్
మరోవైపు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ముంబైలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఇండిపెండెన్స్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. భార్య నీతా అంబానీ, మనవడు పృథ్వీ ఆకాశ్ అంబానీలతో కలిసి వేడుక చేసుకున్నారు. మనవడిని ముఖేశ్ ఎత్తుకోగా... నీతా అంబానీ మువ్వన్నెల పతాకాన్ని చేత పట్టుకున్నారు. భారత్ మాతాకీ జై అంటూ వీరు జాతీయ పతాకానికి వందనం చేశారు.