Balakrishna: 'బింబిసార' దర్శకుడికి ఓకే చెప్పిన బాలయ్య?

Balakrishna  upcoming movies update
  • 'బింబిసార' చూసిన బాలయ్య 
  • దర్శకుడు వశిష్ఠకు అభినందనలు 
  • ఆయనతో సినిమాకి సుముఖత 
  • వచ్చే ఏడాదిలో సెట్స్  పైకి వెళ్లే ఛాన్స్
ఈ మధ్య కాలంలో అందరూ మాట్లాడుకున్న సినిమాగా 'బింబిసార' నిలిచింది. కల్యాణ్ రామ్ కెరియర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టింది. కొత్త దర్శకుడు వశిష్ఠకి ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను చూసిన బాలకృష్ణ దర్శకుడు వశిష్ఠను అభినందించారు. చిన్న వయసులోనే అంతటి భారీ సినిమాను డీల్ చేసిన తీరును కొనియాడారు. 

అప్పటికే వశిష్ఠ గురించి బాలయ్యకి కల్యాణ్ రామ్ చెప్పి ఉండటం వలన, అతనితో సినిమా చేయడానికి బాలయ్య ఓకే అన్నారని చెబుతున్నారు. మంచి కథను రెడీ చేసుకుని వినిపించమని వశిష్ఠతో బాలయ్య అన్నట్టుగా తెలుస్తోంది. మరి బాలయ్యతో వశిష్ఠ మరో సోషియో ఫాంటసీ ప్లాన్ చేస్తాడేమో చూడాలి.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో ఈ సినిమా విడుదల కానుంది. ఆ తరువాత సినిమాను ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు  రానుంది. ఆ తరువాత వశిష్ఠతో కలిసి ఆయన సెట్స్ పైకి వెళ్లొచ్చని అంటున్నారు.
Balakrishna
Vashita
Tollywood

More Telugu News