GST: ఇంటి అద్దెపై 18 శాతం జీఎస్టీ అంటూ వస్తున్న వార్తలపై కేంద్రం స్పష్టత

  • ఇంటి అద్దెపై జీఎస్టీ పట్ల మరింత స్పష్టత నిచ్చిన కేంద్రం
  • మీడియాలో కథనాలపై స్పందించిన ఫ్యాక్ట్ చెక్
  • ఎవరు జీఎస్టీ చెల్లించాలో, ఎవరు చెల్లించనవసరంలేదో వివరణ
Center clarifies on 18 percent GST for tenants

జీఎస్టీ కింద నమోదైన వారు అద్దె ఇళ్లలో ఉంటున్నట్టయితే, ఇంటి అద్దెపై వారు 18 శాతం జీఎస్టీని చెల్లించాలంటూ కథనాలు వచ్చాయి. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. దీంట్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఓ ఇంటిని వ్యాపార సంస్థ అద్దెకు తీసుకున్నప్పుడు మాత్రమే ఆ ఇంటి అద్దెపై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. 

అంతేతప్ప, ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇచ్చినప్పుడు, వ్యక్తిగత అవసరాలకు ఇంటిని అద్దెకు తీసుకున్నప్పుడు ఆ ఇంటి అద్దెపై ఎలాంటి జీఎస్టీ కట్టనక్కర్లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఓ వ్యాపార సంస్థ యజమాని అయినా సరే, భాగస్వామి అయినా సరే వ్యక్తిగత అవసరాల కోసం ఇంటిని అద్దెకు తీసుకుంటే జీఎస్టీ చెల్లించనవసరంలేదని వివరించింది. ఈ మేరకు సమాచార శాఖ ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడించింది.

More Telugu News